లక్కీ హ్యాండ్‌! | - | Sakshi
Sakshi News home page

లక్కీ హ్యాండ్‌!

Feb 18 2026 7:22 AM | Updated on Feb 18 2026 7:22 AM

లక్కీ

లక్కీ హ్యాండ్‌!

– 8లోu

న్యూస్‌రీల్‌

– మరిన్ని వార్తలు, ఫొటోలు 8,9లోu

బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

జనగామ: జనగామ పురపాలక చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య నాటకీయంగా సాగాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నికల అధికారి, ఆర్డీఓ గోపిరామ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సమావేశం హాలులో ప్రారంభమైన ప్రక్రియలో మొదట చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ సభ్యుల ఓటింగ్‌లో ఆ పార్టీకి చెందిన 12 మంది, సీపీఐ(ఎం) నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్రులు, ఎక్స్‌ అఫీషియో ఓటుగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులు ఎత్తడంతో మొత్తం 16 ఓట్లు వచ్చాయి. వెంటనే బీఆర్‌ఎస్‌ సభ్యులు ఓటింగ్‌కు రాగా 13 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటుతో కలిపి వారికి కూడా 16 ఓట్లు రావడంతో టెన్షన్‌ నెలకొంది.

లాటరీ పద్ధతిలో..

ఇరుపక్షాలకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి గోపిరామ్‌ లాటరీ విధానాన్ని అమలు చేశారు. కాంగ్రెస్‌ తరఫున 22వ వార్డు కౌన్సిలర్‌ కడకంచి బాలమణి, బీఆర్‌ఎస్‌ తరఫున 18వ వార్డు సభ్యుడు గోపగోని సుగుణాకర్‌ గౌడ్‌ పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్‌ తరఫున చైర్మన్‌ అభ్యర్థిగా బాలమణిని 15 వార్డు సభ్యుడు మారబోయిన పాండు ప్రతిపాదించగా, 25వ వార్డు కౌన్సిలర్‌ పాముకుంట్ల ప్రసాద్‌ మద్దతు పలికారు. బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థి గోపగోని సుగుణాకర్‌గౌడ్‌ను 17వ వార్డు సభ్యుడు ఉడుగులు కిష్టయ్య ప్రతిపాదించగా, 9వ వార్డు సభ్యురాలు గునిగంటి వెన్నెల పద్దతిచ్చారు. అనంతరం ఇద్దరు చైర్మన్‌ అభ్యర్థుల పేర్లతో ఐదు చొప్పున చీటీలు రాసి డబ్బాలో వేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులు, పోలీసుల సమక్షంలో మొదట తీసిన చీటీలో బాలమణి పేరు రావడంతో ఆమె లక్కీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆర్డీఓ అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. తర్వాత వైస్‌ చైర్మన్‌ పదవికి కూడా ఇదే విధానం పాటించారు. బీఆర్‌ఎస్‌ మద్దతు దారుడు 23వ వార్డు కౌన్సిలర్‌ భూష పర్వతాలు, కాంగ్రెస్‌ మద్దతుదారుడు 15వ వార్డు సభ్యుడు మారబోయిన పాండు పేర్లతో చీటీలు వేసి తీసిన సమయంలో భూష పర్వతాలు పేరు రావడంతో ఆయన వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికై న ఇద్దరికీ ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించి అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఓటింగ్‌ సమయంలో ఉద్రిక్తత

ఎన్నిక జరిగే సమయంలో ఓటింగ్‌ హాలులో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే స్వతంత్ర కౌన్సిలర్‌ మారబోయిన పాండు సీటింగ్‌ అమరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. చేతులెత్తే ప్రక్రియలో బీఆర్‌ఎస్‌ టర్మ్‌ వచ్చిన సమయంలో పాండు, కాంగ్రెస్‌కు చెందిన 27వ వార్డు కౌన్సిలర్‌ చెంచారపు కరుణాకర్‌రెడ్డి కలిసి బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్న 8వ వార్డు మహిళా సభ్యురాలు మంజుల చేయిని కిందికి లాగి గుంజేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో పాటు వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. చివరకు మంజుల బీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. ఈ సంఘటనపై అక్కడే ఉన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. దాదాపు 45 నిమిషాల పాటు హాల్లో ఉద్రిక్తత నెలకొనగా భారీగా పోలీసులు మోహరించారు. ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోగా, ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ బాలమణిని

వరించిన అదృష్టం

వైస్‌ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ భూష పర్వతాలు

ఎన్నిక ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత

ఓటెయ్యకుండా అడ్డుకున్నారు..

ఎమ్మెల్యే పల్లా, దళిత కౌన్సిలర్ల ఆరోపణ

ఎమ్మెల్యే..సభ్యులను కొనాలని చూశారు

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

లాటరీ పద్ధతిలో జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక

లక్కీ హ్యాండ్‌!1
1/3

లక్కీ హ్యాండ్‌!

లక్కీ హ్యాండ్‌!2
2/3

లక్కీ హ్యాండ్‌!

లక్కీ హ్యాండ్‌!3
3/3

లక్కీ హ్యాండ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement