‘స్టేషన్’ చైర్మన్‌గా వినయ్‌కుమార్
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్లు గ్రామ పంచాయతీలను కలుపుతూ నూతనంగా ఏర్పాటు చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ మొదటి కౌన్సిలర్లుగా ఎన్నికై న వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తంగా 18 వార్డులకు గాను 13 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 5 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈమేరకు సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్మన్‌గా తాటికొండ వినయ్‌కుమార్(కాంగ్రెస్), వైస్ చైర్మన్‌గా నీల రాజమ్మ(కాంగ్రెస్) ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు క్యాంపునకు వెళ్లిన 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఉదయం 11 గంటల ప్రాంతంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే కడియం చివరి నిమిషం వరకు వైస్ చైర్మన్ ఎవరనేది తెలియనీయకుండా సీల్ కవర్‌లో ప్రతిపాదించిన పేరును కౌన్సిలర్లకు తెలిపి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కాగా పోలీసులు కౌన్సిలర్లను తనిఖీ చేసి కార్యాలయంలోకి పంపారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నినాదాలు చేస్తూ మున్సిపాలిటీ వద్దకు చేరుకున్నారు. వారిని సైతం తనిఖీ చేసిన పోలీసులు లోపలికి పంపారు. కాగా ఉదయం 11 గంటల అనంతరం నూతన పాలకవర్గ సభ్యులచే ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న నియమనిబంధనలకు అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేయించారు.
వైస్ చైర్మన్‌పై ఉత్కంఠ
చైర్మన్ అభ్యర్థిని మొదటి నుంచి అందరూ ఊహిస్తున్నప్పటికీ వైస్ చైర్మన్ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా చివరి నిమిషంలో వైస్ చైర్మన్‌గిరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీల రాజమ్మను వరించింది.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న పర్యవేక్షణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సభ్యులు ఉండటంతో ఆపార్టీకే రెండు పదవులు దక్కాయి. 13వార్డు కౌన్సిలర్‌గా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వినయ్‌కుమార్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాగా వైస్ చైర్మన్‌గా 11వ వార్డు నుంచి ఎన్నికై న నీల రాజమ్మ(కాంగ్రెస్) ఎన్నికయ్యారు. చైర్మన్‌గా వినయ్‌కుమార్ పేరును గుర్రం హరినాధ్ ప్రతిపాదించగా బొల్లు లక్ష్మీ బలపర్చారు. అదేవిధంగా వైస్ చైర్మన్‌గా నీల రాజమ్మను పొన్న రవి ప్రతిపాదించగా అంగడి రజిత బలపర్చారు. కార్యక్రమంలో కమిషనర్ రాధాకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మేనేజర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు తాటికొండ మధు, గుర్రం హరినాధ్, గుర్రం హైమ, బూర్ల రాజేశ్వర్, చల్లా రమ్య, బలగాని అనీల్, అన్నెపు సుమలత, పొన్న రాజేష్, తోకల అనూష, సౌదరపల్లి సంపత్‌రాజు, గట్టు సంగీత, పెసరు క్రిష్ణవేణి, బొల్లు లక్ష్మీ, అంగడి రజిత, పొన్నం స్వరూప, పొన్న రవి పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక సీఐ జి.వేణు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.
వైస్ చైర్మన్‌గా నీల రాజమ్మ
ప్రశాంతంగా ఎన్నిక
‘స్టేషన్’ చైర్మన్‌గా వినయ్‌కుమార్
‘స్టేషన్’ చైర్మన్‌గా వినయ్‌కుమార్
‘స్టేషన్’ చైర్మన్‌గా వినయ్‌కుమార్


