ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి..
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుదవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్‌తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేది నుంచి వచ్చే నెల16వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 8,605 విద్యార్థులు పరీక్షలు హాజరుకానున్నారన్నారు. ఇందులో 4,211 ప్రథమ సంవత్సరం, 4,394 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. విద్యార్థులు సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు కంట్రోల్ రూమ్ నెంబర్ 9550371371 కి ఫోన్ చేయవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి , విద్యుత్, విద్యాశాఖ, మెడికల్, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పేదల అభ్యన్నతికి ప్రభుత్వం కృషి..
పేద మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శ్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పని తీరు, ఆర్థిక ప్రణాళికలు, బ్యాంకు లింకేజీ రు ణాలపై బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించా రు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, ఏపీడీ నూరిద్దిన్, జిల్లా సమైఖ్య అధ్యక్షులు, ఓబీ సభ్యులు, సీ్త్ర నిధి రీజినల్ మేనేజర్ ప్రమీల, అసిస్టెంట్ మేనేజర్‌లు తదితరులు పాల్గొన్నారు.
వరదల సమయంలో జాగ్రత్తలు
అకాల వర్షాలు విపత్కర పరిస్థితుల సమయంలో తీసుకోవలిసిన చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నా రు. హైదరాబాద్‌కు చెందిన 10వ బెటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో బుధవారం నెల్లుట్ల చెరువు వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీఓ గోపిరామ్, ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ ముఖేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల మాదక ద్రవ్యాల వినియోగ నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల వినియోగ నివారణ మీద తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి సమీక్షించారు.
జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్


