కదిలింది..కార్మికదండు! | - | Sakshi
Sakshi News home page

కదిలింది..కార్మికదండు!

Feb 13 2026 3:15 AM | Updated on Feb 13 2026 3:15 AM

కదిలింది..కార్మికదండు!

కదిలింది..కార్మికదండు!

లేబర్‌కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల భారీ ప్రదర్శన

జనగామ రూరల్‌: బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని, దానిద్వారానే 4 లేబర్‌కోడ్‌లను వెనక్కితీసుకొనేలా చేయగలమని ఐఎన్‌టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఽ శ్రీదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా నాయకుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణనాయక్‌ పిలుపునిచ్చారు. గురువారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా సీఐటీయూ, బీఆర్టీయూ, ఐఎన్‌టీయూసీ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల కేంద్ర కమిటీల పిలుపులో భాగంగా రైల్వే స్టేషన్‌ నుంచి ప్రెస్టిన్‌ గ్రౌండ్‌ వరకు కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం, బైరగోని అంజమ్‌, రాజమణి, కోమల్ల ఎల్లమ్మ, బూడిద ప్రశాంత్‌, తోటగోని రాధ, ఎర్రబెల్లి సంతోష తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం తీసుకోచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement