ప్రాంగణాలపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

ప్రాంగణాలపై పట్టింపేది?

Feb 27 2026 4:23 AM | Updated on Feb 27 2026 4:23 AM

ప్రాంగణాలపై పట్టింపేది?

ప్రాంగణాలపై పట్టింపేది?

స్పోర్ట్‌ ్స స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: జిల్లాలోని గ్రామీణ క్రీడా మైదానాలు(ప్రాంగణాలు) పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో బోర్డులు తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికి గత ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంకల్పించింది. ఇందుకు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు గుర్తించింది. వాటిలో నిర్మాణాలు చేపట్టి బోర్డులను ఏర్పాటు చేసింది. ఆశయం గొప్పదే అయినప్పుటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకావడం లేదు. వాటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడంలో అలసత్వం వల్ల నిరుపయోగంగా మారాయి. జిల్లావ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలు 201 అనుబంధ గ్రామాలు ఉండగా మొత్తం 483 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు గుర్తించి 450 వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రతీ క్రీడా ప్రాంగణానికి రెండు లక్షల చొప్పున వెచ్చించారు. చాలా చోట్ల అనువైన స్థలాలు దొరక్కపోవడంతో అందుబాటులో ఉన్న చోట చదును చేసి బోర్డులు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. ప్రతీ వార్డులో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నవి పిచ్చిమొక్కలతో నిండిపోయి ఆడుకోవడానికి వీలుకాకుండా తయారయ్యాయి.

క్రీడా పరికరాలు ఎక్కడ?

లక్ష్యానికి అనుగుణంగా క్రీడాకారుల్లో ఆసక్తిని బట్టి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పరికరాలు అందజేశారు. జిల్లా అధికారులు వాటిని ఎంపీడీఓ కార్యాలయాలకు పంపించారు. అక్కడ నుంచి గ్రామాలకు చేర్చారు. క్రికెట్‌ కిట్లు, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, డంబెల్స్‌, రింగ్‌ బాల్స్‌, టీషర్టులు వంటి పెద్ద మొత్తంలో ఇచ్చారు. ప్రస్తుతం అవి ఎక్కడా ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది.

దూరంగా క్రీడా ప్రాంగణాలు..

ప్రతీ పంచాయతీలో ఎకరం స్థలంలో ప్రాంగణం ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని గ్రామాలో స్థలం లభించకపోవడంతో అందుబాటులో ఉన్న స్థలంలోనే నిర్మించారు. కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా ఉండడంతో వాటి నిర్వహణ చూసేవారు కరువయ్యారు. పాఠశాలల్లో, వెంచర్లలో లక్షలు ఖర్చు చేసిన ప్రాంగణాలు పనికి రాకుండా పోతున్నాయి. జనగామ మండల యశ్వాంతాపూర్‌లో కిలోమీటర్‌ దూరంలో ఉండగా అందులో మొక్కలు నాటి వదిలేశారు. వడ్లకొండలో స్థలం లేక వెంచర్‌ భూమి లో నిర్మించారు. ఎల్లంలతో పాటు మరి కొన్ని గ్రామాల్లో నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు దూరంగా అనేక ప్రాంగణాలు ఉన్నాయి. జఫర్‌గఢ్‌లో తిమ్మంపేట, బచ్చన్నపేటలో కేసిరెడ్డిపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నమిలిగొండ, సముద్రాల, రంగరాయిగూడెంతో పాట పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు వసతుల లేక సమస్యలతో దర్శనమిస్తున్నాయి.

పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న క్రీడా మైదానాలు

పరికరాలు లేవు.. వసతులు కరువు

నిర్వహణ పట్టించుకోని అధికారులు

జిల్లావ్యాప్తంగా 483 గ్రామీణ క్రీడా మైదానాలు

లక్షలు ఖర్చు పెట్టినా ప్రయోజనం శూన్యం

జనగామ రూరల్‌: రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి కె.కోదండ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. పేర్లు నమోదుచేసుకున్న వారికి ఆయా మండల కేంద్రంలో ఎంపిక ఉంటుందన్నారు. మండల స్థాయిలో ఎంపికై న వారిని జిల్లాస్థాయిలో 28న మినీ స్టేడియంలో ఎంపిక చేసి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపుతామన్నారు. అర్హులైన వారు tgss telangana.govt.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ఒరిజినల్స్‌, జిరాక్స్‌ కాపీలను తీసుకుని రావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement