వైభవంగా బుగులు వెంకన్న రథోత్సవం
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం ఉదయం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ హోమం బలిహరణం నిర్వహించారు. సాయంత్రం 6.30కి రథోత్సవాన్ని ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావు ప్రారంభించారు. ఆలయం నుంచి పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. గ్రామంలో సర్పంచ్ నలిమెల అనితనవీన్, ఉప సర్పంచ్ రాజారపు రంజిత్‌కుమార్, ధర్మకర్తలు గణగోని రమేశ్ నారాయణరెడ్డి, తదితరులు స్వాగతం పలికారు.
చట్టం ప్రకారం నడుచుకోవాలి
● జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
జనగామ రూరల్: చట్టం ప్రకారం నడుచుకోవాలని, సమాజంలో అందరు సమానులే అని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. అదివారం జిల్లా కేంద్రానికి రాగా మండలంలోని వెంకిర్యాల గ్రామ సర్పంచ్ గొల్లపల్లి ఆలేఖ్య ఈర్ల నవీన్ కుమార్ తమ సమస్యలను తెలిపారు. అనంతరం జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నారని గ్రామ ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకుని రాగా సర్పంచ్ వెళ్లి వారిని అడిగితే.. కులంపేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈవిషయమై జనవరి 15 తేదీన పిటిషన్ ఇచ్చినా సీఐ సత్యనారాయణ రెడ్డి గ్రామస్తులతో కౌన్సిలింగ్ చేశారని, కానీ చట్టపరమైన చర్యల కేసు పెట్టలేదని అన్నారు. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ నివాసానికి సీఐ రాగా అధికార పార్టీకి వత్తాసు పలుకకుండా వెంటనే విచారణ జరిపి కేసు రిజిష్టర్ చేయాలన్నారు. లేని పక్షంలో చట్టం ప్రకారం బాధ్యులు అవుతారని ఢిల్లీలో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ వద్దకు రావాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ అలేఖ్య సీఐకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
సమస్యలు పరిష్కరించాలని పాల ఉత్పత్తిదారుల ధర్నా
బచ్చన్నపేట: మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పాల ఉత్పత్తిదారులు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం పాల క్యాన్లతో వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామ పాలను బచ్చన్నపేట మినీ డెయిరీలో కాకుండా జనగామ డెయిరీలో దించితే పలు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. సకాలంలో బిల్లులు రాకపోగా వెన్న శాతం కూడా తక్కువ వస్తుండడంతో డబ్బులు తక్కువ వస్తున్నాయని, బిల్లులు నెలకు ఒకసారి కూడా రావడం లేదన్నారు. తమ గ్రామ పాలను బచ్చన్నపేటలోనే దిగుమతి చేసుకోవాలని భీష్మించుకోగా ధర్నా వద్దకు బీఎంసీ మండల చైర్మన్ పుర్మ జోగిరెడ్డి, సూపర్‌వైజర్ శ్రీనివాస్‌రెడ్డి వచ్చి బచ్చన్నపేటలోనే దిగుమతి చేసుకుంటామని హామీ ఇవ్వడంతో పాల ఉత్పత్తిదారులు ధర్నా విరమించారు.
నూతన సబ్‌స్టేషన్ పరిశీలన
చిల్పూరు: మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించి త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 33/11కేవీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ను ఆదివారం రాత్రి ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రావు సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్‌లో పనులు పూర్తి అయ్యాయని రెండు వారాల్లో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు,. ఆయన వెంట ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈ సురేష్, లైన్ ఇన్‌స్పెక్టర్ ఐలేష్, కృష్ణంరాజు, రాజిరెడ్డి, రవి, సిద్ధయ్య, శ్రీను సర్పంచ్ గుగులోతు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా బుగులు వెంకన్న రథోత్సవం


