జనగామ: పట్టణంలోని 22వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. 22వ వార్డుతో పాటు పట్టణంలోని మిగతా 29 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 22వ వార్డు కార్యక్రమాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించి వెళ్లారు. అంతకు ముందు ముఖ్యమంత్రి పంపించిన సందేశాన్ని చదివి వినిపించి, ప్రతిజ్ఞ చేశారు. చైర్‌పర్సన్ బాలమణి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా పట్టణంలో స్వచ్ఛతను మరింత మెరుగుపరచడం తమ లక్ష్యమని తెలిపారు. పట్టణ రూపురేఖలను మార్చేందుకు స మష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్‌రెడ్డి, రామగళ్ల విజయ్, దోర్నాల అనితవెంకటేశ్వర్లు, మంత్రి సుమలతశ్రీశైలం, అండాలు, పురపాలిక మేనేజరు రాములు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గోపయ్య, మల్లిగారి మధు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి
బాలమణి శ్రీనివాస్
22వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభం


