పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 8 గంటలకు ఆలయం ద్వారబంధనం చేశారు.
శ్రీ సిద్ధేశ్వరాలయం..
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరాలయాన్ని చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేసినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ, ప్రధాన అర్చకులు ఓం నమశివాయ తెలిపారు.
చిల్పూరు ఆలయం..
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ అర్చకులు ద్వారబంధనం చేశారు.


