కేసీఆర్‌ను జాతిపిత అనడం సిగ్గుచేటు
స్టేషన్‌ఘన్‌పూర్: మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అనడానికి బీఆర్‌ఎస్ నాయకులకు సిగ్గుండాలని, దేశానికై నా, రాష్ట్రానికై నా ఒక్కరే జాతిపిత మహాత్మగాంధీ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటువ్యాఖ్యలు చేశారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని, సకల జనుల ఉద్యమ ఫలితంగా సిద్ధించిందన్నారు. ఇంకా ఎంత కాలం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటూ రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, ఉపేందర్, కిషన్‌రాజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అభివృద్ధికి పట్టంకట్టారు..
జఫర్‌గఢ్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తహసీల్దార్ రాజేష్‌రెడ్డి, సర్పంచ్ కుల్లా మోహన్‌రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, అన్నెబోయిన భిక్షపతి పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి


