టేబుల్‌ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం | - | Sakshi
Sakshi News home page

టేబుల్‌ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం

Feb 21 2026 7:34 AM | Updated on Feb 21 2026 7:34 AM

టేబుల

టేబుల్‌ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం

వరంగల్‌ క్రైం: సైబరాబాద్‌ కమిషనరేట్‌ వేదికగా నిర్వహిస్తున్న నాలుగో రాష్ట్ర స్థాయి పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌లో టేబుల్‌ టెన్నిస్‌ గెజిటెడ్‌ అధికారుల విభాగంలో వరంగల్‌ పోలీ స్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. అదేవిధంగా 55 ఏళ్ల గె జిటెడ్‌ అధికారుల బ్యాడ్మింటన్‌ విభాగంలో వ రంగల్‌ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు జితేందర్‌రెడ్డి, మధుసూదన్‌ జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించారు.

కమిషనరేట్‌ హాకీ జట్టుకు కాంస్య పతకం

రామన్నపేట: హైదరాబాద్‌లో జరుగుతున్న రా ష్ట్ర పోలీసుల తెలంగాణ స్టేట్‌ నాలుగో మీట్‌లో కమిషనరేట్‌కు చెందిన హాకీ జట్టు మూడో స్థానంలో నిలిచినట్లు సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలి పారు. ఆర్‌ఐ ఉదయభాస్కర్‌ నాయకత్వంతో పాల్గొన్న ఈ జట్టు కాంస్య పతకం సాధించినట్లు పేర్కొన్నారు. పలు విభాగాల్లో కమిషనరేట్‌ పోలీసులు క్రమశిక్షణ, శారీరక దారుఢ్యంతో ముందంజలో ఉన్నట్లు వివరించారు.

కలెక్టర్‌కు ఆహ్వానపత్రిక

చిల్పూరు: ఈనెల 23 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్న చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజ రుకావాలని శుక్రవారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌కు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న ఆహ్వాన పత్రిక అందించారు. శుక్రవారం అర్చకులు రవీందర్‌శర్మ, కృష్ణమాచార్యులు, జూనియర్‌ అసిస్టెంట్‌ కుర్రెంల మోహన్‌తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌కు అడిషనల్‌ కలెక్టర్‌ పింకేశ్‌కుమార్‌కు అనంతరం డీసీపీ రాజమహేంద్రనాయక్‌కు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు.

‘ఉద్యం’తో నిరుద్యోగులకు ప్రయోజనాలు

దేవరుప్పుల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు ఉద్యం నమోదు ప్రక్రియతో నిరుద్యోగులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ శివకృష్ణ ఠాగూర్‌ సూచించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం– జనగామ, వ్యవస్థాపకత అభివృద్ధి కేంద్రం జనగామ ఆధ్వర్యంలో ఉద్యం రిజిస్ట్రేషన్‌న్‌పై ఎంపీడీఓ మేనక పౌడేల్‌ అధ్యక్షతన ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ, యువకులు, మహిళలు వ్యక్తిగతం మొదలుకొని కుటీర పరిశ్రమలు నెలకొల్పాలన్నా ఉద్యం పోర్టల్‌ నమోదు చేసుకోవాలన్నారు. అప్పుడే రుణమంజూరుతో పాటు రాయితీలు పొందుతారన్నారు. కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్‌లు కె.శ్రీనివాస్‌, ఎస్‌.మూర్తి, ఈడీసీ మేనేజర్‌ చీటూరి సతీష్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ వడ్లూరి ఫిలిప్‌, సూపరింటెండెంట్‌ పుష్పలత పాల్గొన్నారు.

విద్యార్థి దశలో పదో తరగతి కీలకం

స్టేషన్‌ఘన్‌పూర్‌: విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకమని, విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీసీఈబీ సెక్రెటరీ చంద్రభాను అన్నారు. ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట ఏసీజీ రవికుమార్‌ ఉన్నారు.

టేబుల్‌ టెన్నిస్‌లో  సీపీకి కాంస్య పతకం1
1/3

టేబుల్‌ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం

టేబుల్‌ టెన్నిస్‌లో  సీపీకి కాంస్య పతకం2
2/3

టేబుల్‌ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం

టేబుల్‌ టెన్నిస్‌లో  సీపీకి కాంస్య పతకం3
3/3

టేబుల్‌ టెన్నిస్‌లో సీపీకి కాంస్య పతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement