తనిఖీ బృందాలు వచ్చేస్తున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

తనిఖీ బృందాలు వచ్చేస్తున్నాయ్‌!

Feb 21 2026 7:34 AM | Updated on Feb 21 2026 7:34 AM

తనిఖీ బృందాలు వచ్చేస్తున్నాయ్‌!

తనిఖీ బృందాలు వచ్చేస్తున్నాయ్‌!

జనగామ: జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ విద్యారంగం పర్యవేక్షణ మరింత బలోపేతం చేస్తూ జిల్లా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయిల్లో జిల్లాస్థాయి ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ (తనిఖీ బృందాలు)లను ఏర్పాటు చేస్తూ సర్కారు గతంలోనే ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్ర డైరెక్టర్‌ ఆదేశాలు, కలెక్టర్‌ ఆమోదంతో స్క్రూ టినీ కమిటీ పరిశీలన అనంతరం టీచర్ల తుది జాబితా విడుదల చేశారు. జిల్లాలో 103 ఉన్నత, 64 ప్రాథమికోన్నత, 348 ప్రాథమిక పాఠశాలకు టీమ్‌లు కేటాయించగా, నోడల్‌ ఆఫీసర్లతో సహా పూర్తిస్థాయి సభ్యులు విధుల్లోకి దిగనున్నారు. రిపోర్టులు, రీ–ఇన్‌స్పెక్షన్లు తప్పనిసరి చేస్తూ డీఈఓ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను అనుసరించి టీచర్ల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ టీంలకు తుది ఆమోదం లభించింది. ఉపాధ్యాయుల అర్హత, అనుభవం, సేవా రికార్డుల పరిశీలన వంటి ప్రమాణాల ఆధారంగా జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తుది జాబితా విడుదల

జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలపై నిత్య పర్యవేక్షణ, రీ–ఇన్‌స్పెక్షన్లు ఫాలోఅప్‌ల కోసం రూపొందించిన హైస్కూల్‌, ఉన్నత ప్రాథమిక, ప్రాథమిక స్థాయి టీమ్‌ల పూర్తి వివరాలు స్పష్టం చేశారు. హైస్కూల్‌ స్థాయిలో 103 పాఠశాలలకు టీమ్‌లను ఏర్పాటు చేశారు. నోడల్‌ ఆఫీసర్‌ బి.రఘుజీ (ఉన్నత, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్‌), బి.రాంబాబు (ఉన్నత, లింగంపల్లి, చిల్పూర్‌), ఎం.శ్రీనివాస్‌ (ఉన్నత, ఇప్పగూడెం, స్టేషన్‌ఘనపూర్‌), బి.శ్రీకాంత్‌ (ఉన్నత, స్టేషన్‌ఘన్‌పూర్‌), ఎస్‌.సత్తయ్య(ఉన్నత, గానుగుపహాడ్‌, జనగామ), బి.రాజిత కుమారి (ఉన్నత, దేవరుప్పుల), పి.కిషనన్‌కుమార్‌ (ఉన్నత, రాజవరం, చిల్పూర్‌), డాక్టర్‌ ఎం. సుభాష్‌ (ఉన్నత, పెంబర్తి, జనగామ), టి.వెంకటేశ్వర్లు (ఉన్నత,ఛాగల్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌) వీరు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విధులు నిర్వర్తించనున్నారు.

ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు

ప్రాథమికోన్నత పాఠశాలల ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ల పరిధిలో 64 యూపీఎస్‌, 348 పీఎస్‌లు ఉన్నాయి. ఇందులో నోడల్‌ ఆఫీసర్‌ కె.నర్సింహారావు (ఉన్నత, కట్కూరు, బచ్చన్నపేట), సభ్యులు టి.హరిప్రసాద్‌ (యూపీఎస్‌, గుమ్మడివెల్లి, లింగాలఘన్‌పూర్‌), ఎం.రాఘవులు(యూపీఎస్‌, నేలపోగుల, లింగాలఘన్‌పూర్‌), ప్రాథమిక పాఠశాలల పరిఽధిలో 111 స్కూళ్లకు గాను ఒక టీమ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో నోడల్‌ ఆఫీసర్‌గా ఎం.రమేశ్‌బాబు (పీఎస్‌, అంబేడ్కర్‌నగర్‌, జనగామ), పి.సతీష్‌బాబు(పీఎస్‌, రైల్వేస్టేషన్‌, జనగామ), ప్రాథమిక పాఠశాలల ఇన్‌స్పెక్షన్‌ రెండో టీంలో నోడల్‌ ఆఫీసర్‌ బి.రమేశ్‌(పీఎస్‌, కడవెండి, దేవరుప్పుల), ఎన్‌.జయపాల్‌రెడ్డి(పీఎస్‌, బానాజీపేట, రఘునాథపల్లి)ని ఎంపిక చేశారు.

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ

2025–26 విద్యా సంవత్సరానికి నియామకం

టీచర్ల రిలీవింగ్‌పై ఎంఈఓ,

హెచ్‌ఎంలకు ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement