● లైన్‌మెన్ దినోత్సవంలో ఎస్‌ఈ సంపత్‌రెడ్డి
జనగామ: ఎన్పీడీసీఎల్ సంస్థలో పనిచేస్తున్న లైన్‌మెన్ల అంకితభావం, నిబద్ధతతోనే సంస్థకు మంచిపేరు వస్తుందని ఎస్‌ఈ సంపత్‌రెడ్డి అన్నారు. లైన్‌మెన్ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ.. విద్యుత్ విభాగంలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించే లైన్‌మెన్ సేవలు ప్రశంసనీయమన్నారు. లైన్‌మెన్‌ల సేవలకు గుర్తింపుగా సత్కరించి, ప్రశంసపత్రాలు, పోల్ కై ్లంబింగ్ క్లాంపులు అందజేసి వారి సేవాభావాన్ని అభినందించారు. డీఈలు గణేష్, లక్ష్మీనారాయణరెడ్డి, సబ్‌డివిజన్ ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు సౌమ్య, చంద్రమోహన్, రూరల్ ఏఈఈ మధు, సబ్ ఇంజనీర్లు మనో హర్, కృప, టౌన్–1, టౌన్–2, రూరల్ సిబ్బందితో పాటు ఎఫ్‌ఎం, ఎస్‌ఎల్‌ఐ, ఎల్‌ఎం, ఏఎల్‌ఎం, జేఎల్‌ఎం, ఆర్టిజన్స్, కట్టర్స్ పాల్గొన్నారు.


