నేడు మున్సిపల్ పాలకమండలి బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ మున్సిపల్ నూతన పాలక మండలి చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భూష పర్వతాలు, 28 మంది కౌన్సిలర్లతో కూడిన మండలి సభ్యుల పరిచయ కార్యక్రమం ఈనెల 27న (శుక్రవారం) నిర్వహించనున్నారు. మున్సిపల్ కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 11 గంటలకు నూతన పాలకమండలి పరిచయ కార్యక్రమంతో పాటు చైర్‌పర్సన్ అధికారికంగా బాధ్యతలను తీసుకోనున్నారు. అనంతరం కొత్తగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నట్లు కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.


