ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు

ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు

ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు

మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027

హన్మకొండ: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్‌ ఆర్టీసీ రూ.20,24,28,124 ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్‌ డేస్‌లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్‌)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు.

ఉద్యోగుల సమష్టి కృషితో...

అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో జాతరను విజయవంతం చేశాం. ఏర్పాట్లు మొదలు నుంచి జాతర పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ కష్టించి పని చేశారు. జాతరను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు.

దర్శనం విజయ భాను, ఆర్‌ఎం, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement