డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సంయుక్తంగా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను, స్ట్రాంగ్‌రూమ్‌ను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, భద్రతా ప్రమాణాల మేరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయి సిద్ధం చేయాలని ఆదేశించారు. వారి వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, ఏసీపీ భీమ్‌శర్మ తదితరులున్నారు.


