నానోయూరియాపై రైతులకు అవగాహన
● వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో
మాట్లాడిన మంత్రి తుమ్మల
జనగామ రూరల్: ప్రతీ మంగళవారం జరిగే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చీటకోడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్‌న్స్ ద్వారా రైతులకు వరిలో వచ్చే చీడపీడలు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం, నానోయూరియా గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రైతులకు అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామానికి చెదిందిన రైతు బండారు తిరుపతితో మాట్లాడారు.. గ్రామంలో యూరియా కొరత లేదని యూరియా యాప్ విధానంతో ఇబ్బందులు తొలిగిపోయాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, జనగామ ఏడీఏ అపర్ణ, చీటకోడూరు సర్పంచ్ కూకట్ల యాదగిరి, ఉప సర్పంచ్ ఎం.చంద్రకళ, ఏఈఓ గిరిరాజు, అనిల్ కుమార్, చింతకింది రాజేష్, బండ మమత, రిషిత పాల్గొన్నారు.


