ఇచ్చిన మాట తప్పేది లేదు
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడంతో పాటు తమ నీలిమా ఆస్పత్రిలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం చివరి రోజు ప్రచారంలో భాగంగా పట్టణంలోని 30 వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి వార్డు నుంచి నీలిమా ఆస్పత్రికివె వెళ్లి ఉచిత వైద్యం, మందులు, ఆపరేషన్లతో కార్పోరేట్ చికిత్సలు పొందుతున్నారన్నారు. ఈ సేవలు మరో 3ఏళ్ల పాటు ఇలాగే కొనసాగుతాయన్నారు. జనగామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, పట్టణ ప్రజలు ఆలోచన చేసిన బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


