పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం
స్టేషన్‌ఘన్‌పూర్: ఈనెల 9న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి పంపిణీకి స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఆర్‌డీఓ సోమవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..18 వార్డులకు ఆరు లొకేషన్లలో 36 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 2, ఛాగల్లులో 2, శివునిపల్లిలో 2 లొకేషన్లలో పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు.
రేపటి నుంచి వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు
జనగామ: పురపాలిక ఎన్నికల సందర్భంగా ఈ నెల11, 12వ తేదీన జనగామ వ్యవసాయ మార్కెట్‌కు సెలవులను ప్రకటించడం జరిగిందని ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12వ తేదీన హమాలీ కార్మికుల కోరిక మేరకు బంద్ ఇచ్చినట్లు, 13వ తేదీన యథావిధిగా సేవలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.
నిరుద్యోగులకు
ఉద్యోగ అవకాశాలు
జనగామ రూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కలెక్టర్ ఆదేశానుసారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సహకారంతో జాబ్ గ్యారంటీతో కూడిన ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఆర్డీఓ వసంత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భాగంగా హైదరాబాద్‌లోని విద్యానగర్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 30 మంది యువతీ యువకులు శిక్షణలో చేరారన్నారు. రియల్ టైమ్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, సప్లై చైన్ అసోసియేట్, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంశాలపై వీరికి మూడు నెలల ఉచిత వసతితో కూడిన శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ నెల చివరి భాగంలో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్యాచ్ కోసం మార్చి 5 వ తేదీ నుంచి పై కోర్సులకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు.
సుశ్రుత, దేవర్ష్‌లది కులదురహంకార హత్య
పాలకుర్తి టౌన్: సుశ్రుత, దేవర్ష్‌లది కుల దురహంకార హత్య అని, కులాంతర వివాహాల రక్షణకు చట్టం చేయాలని కులఅసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన అన్నారు. సోమవారం మండలంలోని గూడూరులో సుశ్రుత, దేవర్ష్ ల ఏడో వర్ధంతిని సుశ్రుత తల్లి కోమల, కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కన్వీనర్ గుండె ప్రమోద్, విలాస్, స్పప్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కోర్టు ప్రాంగణంలో నిందితుడి ఆత్మహత్యాయత్నం
జనగామ రూరల్: తాను జైలుకు వెళ్లే అవకాశం ఉందని జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో సోమవారం ఓ నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన కర్ణం సాయికి తల్లిదండ్రులు లేరు. ఒక సోదరి ఉంది. దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇటీవల ఉప్పల్‌కు చెందిన ఒక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పాలకుర్తిలోని డబుల్ బెడ్ రూంలో అద్దెకు ఉంటున్నాడు. ఇటీవల పక్క ఇంట్లో దొంగతనం చేయగా పోలీసులు పట్టుకొని రిమాండ్ తరలించారు. సోమవారం జడ్జి వాదనలు విని జైలుశిక్ష ఖరారు చేశారు. తాను జైలుకు వెళ్లనని, తనకు భార్య ఉందని ఆమెను కూడా జైలుకు పంపాలని గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా ఇప్పటికే 14 సార్లు జైలుకు వెళ్లాడని, అతడికి అలవాటుగా మారిందని పోలీసులు తెలిపారు.
పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం


