రవీందర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం | - | Sakshi
Sakshi News home page

రవీందర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

రవీందర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం

రవీందర్‌రావుకు జీవిత సాఫల్య పురస్కారం

లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల శివారు శ్రీనివాసనగర్‌ కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు, నెల్లుట్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, అనసూయమ్మ లక్ష్మారావు కళాపీఠం నిర్వాహుకుడు నెల్లుట్ల రవీందర్‌రావుకు ఆదివారం రాత్రి శివానీ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్‌లో హనుమాన్‌పేట్‌లోని కమ్యూనిటీ హాల్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో శివానీ ఆర్ట్స్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు పరమేశ్వర్‌, గౌరవ అధ్యక్షుడు దొంతి శిల్పారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జీసీ రెడ్డి, డైరెక్టర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement