మున్సిపోల్‌కు సిద్ధం
న్యూస్‌రీల్
–IIలో
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు పూర్తి
ఫ్లయింగ్ స్క్వాడ్ : 3
స్టాటిక్ సర్వేలెన్స్ : 9
సోమన్న బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు ఆహ్వాన పత్రికను ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న అందించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన్ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. అలాగే అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి షాకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేవగిరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సుక్కా.. ముక్కా
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా ఎన్నికయ్యేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ఓ వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అందించడంతో పాటు ఒక ఇంటికి కిలో చికెన్, అర్ధసేరు మద్యం బాటిళ్లను అందించారు. కాగా చికెన్‌తో పాటు కొత్తిమీర, నిమ్మకాయలను సైతం అందించడం విశేషం. అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్‌కు కేటాయించగా ఘన్‌పూర్‌లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్లు ఉన్న ఒకటో, పదమూడో వార్డులలో పోటీ తీవ్రంగా ఉంది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు సైతం ఓటర్లకు పెద్ద మొత్తంలో తాయిలాలు అందిస్తున్నారు.
డీఎం, సిబ్బందికి ప్రశంసలు
జనగామ రూరల్: మేడారం జాతర 2026 విజయవంతమైన సందర్భంగా మంగళవారం వరంగల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరీంనగర్, రీజినల్ మేనేజర్ వరంగల్ ఆధ్వర్యంలో జనగామ డిపో అధికారులకు, సిబ్బందిని ప్రశంసించారు. ఈసందర్భంగా జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతికి ప్రశంసపత్రాలు అందజేశారు. జనగామలోని ప్రెస్టన్ గ్రౌండ్స్, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి మేడారం జాతరకు 130 స్పెషల్ బస్సులను దిగ్విజయంగా నడిపించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి డీఎం కృతజ్ఞతలు తెలిపారు.
కొనసాగుతున్న
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు జనరల్‌లో 270 విద్యార్థులకు గాను 269 మంది, ఒకేషనల్‌లో 120 మందికి 107 హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలో జనరల్‌లో 260 విద్యార్థులకు 257 మంది, ఒకేషనల్‌లో 40 38 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.
రూట్ ఆఫీసర్స్: 6
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో ఈనెల 11న(బుధవారం) ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేసేలా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలోని 30వార్డుల పరిధిలో 66, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 18వార్డులకు గాను 36 మొత్తంగా 102 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఓట్లు..పోలింగ్ కేంద్రాలు ఇలా..
జిల్లాలోని రెండు పురపాలికల్లో 62,595మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 30,271, మహిళలు 32,314మంది ఉన్నారు. ఇందులో జనగామ పరిధిలో 44,045 ఓటర్లలో పురుషులు 21,358, మహిళలు 2 2,678 ఓటర్లు, ఇతరులు 9 మంది ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 18,550 ఓట్లలో పురుషులు 8,913, మహిళలు 9,636మంది, ఇతరులు ఒక్కరు ఉన్నారు. జనగామలో 66, ఘన్‌పూర్‌లో 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు పురపాలికల్లో ఓట్ల వరకు పరిశీలిస్తే మహిళలదే పైచేయిగా కనిపిస్తోంది.
372మంది అధికారులు, సిబ్బంది
జనగామ, స్టేషన్‌ఘన్‌ఫూర్‌లో పీఓ, ఓపీఓ, తదితర అధికారులు, సిబ్బంది 372 మంది సేవలు అందించనున్నారు. జనగామలో 80 మంది ప్రిసైడింగ్, మరో 80 మంది సహాయ ప్రిసైడింగ్ మొత్తంగా 160 మంది ఉన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 44 మంది ప్రిసైడింగ్, మరో 44 మంది సహాయ ప్రిసైడింగ్‌తో కలుపుకుని 132 మందితో పాటు ఇతర పోలింగ్ అధికారులను నియమించారు. ఇదిలా ఉండగా జనగామ 28, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 9 మంది మొత్తం 37 మంది మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో జరుగనున్నాయి.
ఎలక్షన్ కమిషన్ నిఘా
నేటి పోలింగ్ సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఎప్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. 9మంది జోనల్ ఆఫీసర్స్, 9 మంది రూట్ అధికారులను నియమించామని ఉన్నతాధికారులు తెలిపారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో రెండు చోట్ల ఒక్కొక్కరిని వ్యయ (ఖర్చుల) పరిశీలకులను నియమించారు.
కౌంటింగ్ సూపర్‌వైజర్లు
జనగామ మున్సిపల్ పరిధిలో 36, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 22మంది కౌంటింగ్ సూపర్‌మైజర్స్, అలాగే స్టేషన్‌ఘన్‌పూర్‌లో 44, జనగామ మున్సిపల్‌లో 72 కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు ప్రక్రియను వందశాతం వెబ్‌కాస్టింగ్ ద్వారా నిర్వహించనున్నారు.
పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు
పోలింగ్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏకశిల బీఈడీ కళాశాల, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పట్టగుట్ట రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో పోలింగ్ సామగ్రి(డిస్ట్రిబ్యూషన్) పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు.
మున్సిపాలిటీ పురుషులు మహిళలు అదర్స్ మొత్తం
జనగామ 21,358 22,678 9 44,045
స్టే.ఘన్‌పూర్ 8,913 9,636 1 18,550
మొత్తం 30,271 32,314 10 62,595
పోలింగ్ కేంద్రాలు
జనగామ: 66
స్టేషన్‌ఘన్‌పూర్: 36
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇవే..
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇందులో జనగామలో అంబేడ్కర్‌నగర్(ప్రాథమిక పాఠశాల/పీఎస్), మున్సిపల్ ఆఫీసు, ఉర్దూ మీడియం(లక్ష్మీబాయ్‌కుంట), వీవర్స్ కాలనీ (ప్రాథమిక పాఠశాల), ధర్మకంచ(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), ధర్మకంచ రైల్వే లైన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైల్వేస్టేషన్(ప్రాథమికోన్నత పాఠశాల), గుండ్లగడ్డ ప్రాథమిక ఉర్దూ మీడియం సమస్యాత్మక పరిధిలో ఉన్నాయి. స్టేషన్ ఘన్‌పూర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శివునిపల్లి జెడ్పీహెచ్‌ఎస్, చాగల్లు జెడ్పీహెచ్‌ఎస్, ప్రైమరీ స్కూళ్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు.
జనగామలో నిఘా బృందాలు
ఉదయం 7 నుంచి సాయంత్రం
5 గంటల వరకు పోలింగ్
ఓటు వేయాలంటే గుర్తింపుకార్డు తప్పనిసరి
జనగామలో ఏకశిల బీఈడీ కళాశాల, ఘన్‌పూర్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామగ్రి పంపిణీ
కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ
ఓటేసేందుకు 18 కార్డులు.. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం
మున్సిపోల్‌కు సిద్ధం


