ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: ప్రతిభావంతులైన క్రీడాకారులకు సీఎం కప్ ప్రోత్సాహమని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. శుక్రవారం స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చూపించి గుర్తింపు తీసుకురావాలన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ యువజన, క్రీడల శాఖ అధికారి కోదండరాములు, తహసీల్దార్, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డుల జారీకి
దరఖాస్తుల ఆహ్వానం
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లెన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


