పోలీసుల కవాతు
జనగామ: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు ఓటర్లలో సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించేందుకు పట్టణంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఏఎస్పీ పండేరి నితిన్ చేతన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై, ఆర్‌ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టి.పి. బగేల్, ఇన్‌స్పెక్టర్లు రమణారెడ్డి, ఖలీద్‌తో పాటు 40 మంది బలగాల సహకారంతో ముఖ్య కూడళ్లు, ఆర్టీసీ చౌరస్తా, సున్నితమైన, అప్రమత్తత అవసరమైన ప్రాంతాల్లో కవాతు నిర్వహిచారు.
నేడు మహాశివరాత్రి
జాతరపై సమీక్ష
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
జనగామ: పురపాలిక ఎన్నికల సందర్భంగా పట్టణంలో అత్యధిక స్థానాలు కై వసం చేసుకుని చైర్మన్ పీఠం దక్కించుకునే విధంగా ప్రతీ కార్యకర్త, నాయకులు కష్టపడి పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. నియోజకవర్గ కార్యాలయంలో మంత్రి జిల్లా ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఒక్క కార్యకర్తను కలుపుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని దిశనిర్దేశం చేశారు. అంతకు ముందు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, టీపీసీసీ సభ్యులు లక్ష్మీ నారాయణనాయక్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, వేమెళ్ల సత్య నారాయణరెడ్డి, కంచె రాములు, వంగాల మల్లారెడ్డి, కొమరవెల్లి దేవస్థాన చైర్మన్ వెంకటనర్సింమారెడ్డి తదితరులు ఉన్నారు.
నేడు మంత్రి పొంగులేటి రాక
జనగామ: పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7న (శనివారం) గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రానున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కొమ్మూరి మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తారన్నారు. ఇందులో భాగంగా ధర్మకంచ కమ్యూనిటీ హాల్, 14వ వార్డు అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ చౌరస్తా, తహసీల్ కార్యాలయం ఏరియాలో కార్నర్ మీటింగ్‌లను నిర్వహిస్తామన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్: మొబైల్ యాప్‌లో ఎల్‌సీ తీసుకోవడం ద్వారా ప్రాణాలకు భరోసా ఉంటుందని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ సిబ్బందికి మొబైల్‌యాప్‌లో ఎల్‌సీ తీసుకోవడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఇ టెక్నికల్ గడ్డం గణేశ్, స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈలు శ్వేత, శంకర్, శివకుమార్, సురేష్, సబ్‌ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల కవాతు
పోలీసుల కవాతు


