జిల్లా సరిహద్దులో బోన్ల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

జిల్లా సరిహద్దులో బోన్ల ఏర్పాటు

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

జిల్లా సరిహద్దులో బోన్ల ఏర్పాటు

జిల్లా సరిహద్దులో బోన్ల ఏర్పాటు

పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్‌ అధికారులు

జనగామ రూరల్‌: యాదాద్రి జిల్లా శ్రీనివాసపురం నుంచి చుట్టుపక్కల ఉన్న జిల్లాలోని ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌ఆర్‌ఓ కొండల్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోకి పెద్దపులి ఇంకా ప్రవేశించలేదని, పాదముద్రల ద్వారా సమాచారం సేకరిస్తున్నామన్నారు. జిల్లాలోకి పెద్దపులి వచ్చిందని సమాచారం వస్తుందడంతో ఎఫ్‌ఆర్‌ఓను వివరణ కోరగా ఆవును చంపిన తర్వాత 10 కిలోమీటర్లు వెళ్లి వచ్చి మళ్లీ చనిపోయిన అవును తింటుందని, ఈక్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారం రోజుల పాటు పశువులు ఇంటి వద్ద ఉంచు కోవాలని బావుల వద్దకు గుంపులుగా వెళ్లాలని సూచించారు. శ్రీనివాసపురం, లక్ష్మక్కపల్లిలో బోనులు ఏర్పాటు చేశామని సీసీ కెమెరాల ద్వారా అన్వేషిస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement