టూరిజం కోర్సుల అధ్యయనంతో ఉపాధి
● కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ విజయబాబు
● కేడీసీలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
విద్యారణ్యపురి: టూరిజం కోర్సుల అధ్యయనంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని కేయూ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం రిటైర్డ్ ఆచార్యులు విజయబాబు అన్నారు. సోమవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ‘టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ’ సర్టిఫికెట్ కోర్సును బీసీ విద్యార్థులకు ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. టూరిజాన్ని స్మోక్ లెస్ ఇండస్ట్రీగా అభివర్ణించారు. టూరిజం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సమావేశంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఎ.శ్రీనాఽథ్, చరిత్ర విభాగం అధిపతి ఇందిరాదేవి, ఎస్.సమ్మయ్య, రామ్‌రెడ్డి, బి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ విజయబాబును అధ్యాపకులు సన్మానించారు.


