52.27శాతం ఉత్తీర్ణత
● డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
జనగామ రూరల్: కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల అటానమస్‌గా ఏర్పాటు అయిన తరువాత మొదటిసారిగా కళాశాల ప్రాంగణంలో డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలను ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు శనివారం విడుదల చేశారు. అన్ని కోర్సుల విద్యార్థులు 308మందికి 161 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 52.27గా నమోదైంది. ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారికి సహకరించిన అధ్యాపకులకు కాకతీయ విశ్వవిద్యాలయ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ తిరుమలాదేవి, ప్రొఫెసర్ వెంకటయ్య, కళాశాల ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: పట్టణంలోని 30 వార్డుల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని 5, 6, 7, 8, 9, 10 వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థులను బెదిరిస్తూ, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
52.27శాతం ఉత్తీర్ణత


