అభివృద్ధి చేసే వారికే ఓటు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేసే వారికే ఓటు

Feb 8 2026 4:05 AM | Updated on Feb 8 2026 4:05 AM

అభివృ

అభివృద్ధి చేసే వారికే ఓటు

నిజాయితీ గల నాయకులను అందలం ఎక్కిస్తామంటున్న ఓటర్లు

స్టేషన్‌ఘన్‌పూర్‌: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసేవారినే అందలం ఎక్కిస్తామని స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌.. పక్కనే ఉన్న శివునిపల్లి, ఛాగల్లు గ్రామపంచాయతీలను కలుపుతూ గతేడాది జనవరిలో మున్సిపాలిటీగా అవతరించింది. నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ పలు సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. మున్సిపాలిటీలో 18 వార్డులుండగా ముప్పైవేల పైచిలుకు జనాభా, 18,550 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీగా ఏర్పడి ఏడాది గడుసున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రధానంగా పారిశుద్ధ్యం, డ్రెయినేజీలు, రోడ్లు, నీరు, వీధి దీపాలు, పార్కింగ్‌ తదితర సమస్యలు పేరుకుపోయాయి. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు వివిధ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి, పట్టణ ప్రగతికి పాటుపడేవారికే తమ మద్దతు ఉంటుందని మున్సిపాలిటీ పౌరులు అంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో జయగార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన చర్చావేదికలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చారు.

రోడ్లు, డ్రెయినేజీల సమస్యలు పరిష్కరించాలి

ఘన్‌పూర్‌ పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి

‘సాక్షి’ చర్చావేదికలో పలువురు ప్రముఖుల అభిప్రాయం

అభివృద్ధి చేసే వారికే ఓటు1
1/1

అభివృద్ధి చేసే వారికే ఓటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement