ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్‌రెడ్డి మీ వారే | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్‌రెడ్డి మీ వారే

Feb 8 2026 4:05 AM | Updated on Feb 8 2026 4:05 AM

ప్రభు

ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్‌రెడ్డి మీ వారే

ఐదేళ్ల పాలన రెండేళ్లలో చూపించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిది

కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, పక్కన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఎంపీ కిరణ్‌కుమార్‌ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, హాజరైన జనం

జనగామ: ప్రభుత్వం ప్రజలదని.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల పక్షపాతి అని.. తామంతా కలిసి ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్తూ అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని ధర్మకంచ, ఆర్టీఓ కార్యాలయం, ఆర్టీసీ చౌరస్తా, తహసీల్దార్‌ కార్యాలయం కూడళ్ల వద్ద జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన శనివారం కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రతీ పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తాము జనగామలో కొత్తగా 16 వేల రేషన్‌ కార్డులు ఇచ్చామన్నారు. జనగామ పట్టణాని కి 600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే మరో వెయ్యి మంజూరు చేస్తామని తెలిపారు. 53/1 సర్వే నంబర్‌ పరిధిలోని భూసమస్యను ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పురపాలిక ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, 30 వార్డుల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.

జనగామకు 600 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. ఇంకా మరిన్ని ఇస్తాం

53/1 సర్వే నంబర్‌లోని

భూ సమస్యకు పరిష్కారం చూపిస్తా

పురపాలిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి

రెవెన్యూ శాఖ మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

కాంగ్రెస్‌ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

ఐదేళ్లలో చేస్తామన్న సంక్షేమాన్ని రెండేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్‌ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. 10ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జనగామ పట్టణానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధే నేటికీ ఉందని, దేవాదుల నీరు ఈ ప్రాంతానికి రావడంలో తన కృషి ఎనలేదని చెప్పారు. ఎనిమిదేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్యే.. నాడు ఈ ప్రాంత అభివృద్ధికి పైసా ఇవ్వలేదన్నారు. అవినీతి చేసి సంపాదించిన డబ్బులతో ఓట్లను కొందామని బీఆర్‌ఎస్‌ చూస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో ప్రతిఒక్కరూ రూ.లక్ష కోట్లు సంపాదించారని తెలిపారు.

ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్‌రెడ్డి మీ వారే1
1/2

ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్‌రెడ్డి మీ వారే

ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్‌రెడ్డి మీ వారే2
2/2

ప్రభుత్వం మీది.. సీఎం రేవంత్‌రెడ్డి మీ వారే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement