వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Feb 8 2026 4:05 AM | Updated on Feb 8 2026 4:05 AM

వాతావ

వాతావరణం

జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలి తీవ్రత ఉంటుంది.

నేడు భూపాలపల్లికి

సీఎం రేవంత్‌రెడ్డి

కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు

సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా

బహిరంగ సభ

భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్‌ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్‌ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం 38 కాల్వకు పైప్‌లైన్‌ ఏర్పాటు, భీంఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ ఆధునీకీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్‌ లైనింగ్‌ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది.

ఏర్పాట్లు పూర్తి..

సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్‌ ప్రాంతాలను కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

భారీ బందోబస్తు..

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు.

వాతావరణం
1
1/1

వాతావరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement