బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

పాలకుర్తి టౌన్‌: శ్రీసోమేశ్వర లక్ష్బీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్రనాయక్‌ పరిశీలించారు. ఈసందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో పార్కింగ్‌ ప్రదేశం, క్యూలైన్‌ పరిశీలించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్‌, ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అనుమానితుల కదలికలపై నిఘా

జనగామ: ఎలక్షన్‌ ప్రచారం ముగిసిన నేపథ్యంలో పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డీసీపీ రాజమహేంద్రనాయక్‌ అన్నారు. సోమవారం సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై చెన్న కేశవులుతో కలిసి లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement