ప్రచారానికి నేటితో తెర! | - | Sakshi
Sakshi News home page

ప్రచారానికి నేటితో తెర!

Feb 9 2026 7:47 AM | Updated on Feb 9 2026 7:47 AM

ప్రచారానికి నేటితో తెర!

ప్రచారానికి నేటితో తెర!

ఎన్నికల కమిషన్‌ నిఘా

జనగామ: పది రోజుల పాటు ఉర్రూతలూగించిన పుర ప్రచారం ఈనెల 9న (సోమవారం) సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గత నెల 31వ తేదీ నుంచి అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వార్డుల వెంట ప్రచార రథాలతో మైకుల మోత మోగించి, ఇంటింటికీ తిరిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హోరెత్తిన వార్డులు నేటి రాత్రితో నిశ్శబ్దంలోకి వెళ్లనున్నాయి.

రెండు విడతల్లో..!

ప్రచారం ముగియడంతో, ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి పోల్‌ మేనేజ్‌మెంట్‌పై కేంద్రీకరించనున్నాయి. ఏ వార్డులో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో అన్న లెక్కలను అభ్యర్థులు ముందే సిద్ధం చేసుకుని, దాని ఆధారంగా తాయిలాల పంపిణీ వ్యూహాలు రూపొందిస్తున్నారు. శ్రీఎదుటి పార్టీ అభ్యర్థి ఎంత ఇస్తున్నాడు.. మనం ఎంత ఇవ్వాలి.. ఎక్కడ పంపిణీ చేయాలి..శ్రీఅనే లెక్కలతో పత్రాలు, జాబితాలు సిద్ధమయ్యాయి. నేటి అర్ధరాత్రి నుంచి తొలి విడతగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు మొదలై, ఎన్నికలకు ముందు రాత్రి మరోసారి డబ్బు, గిఫ్టులను పంపిణీ చేయాలనే స్కెచ్‌ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.

ఓటర్ల కోసం రహస్యంగా డీల్‌

జనగామ, స్టేషన్‌న్‌ ఘన్‌పూర్‌ రెండు మున్సిపాలిటీల్లో ఆయా వార్డుల్లో త్రిముఖ పోటీలు ఉండడంతో ఓట్ల కొనుగోలు బరిలో దిగిన అభ్యర్థుల కోసం కీలకంగా మారింది. ముఖ్యంగా 10నుంచి 20శాతం వెనుకబడి ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నోట్లకట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం ఉంది. విజయం కోసం ఏ రిస్క్‌కై నా సిద్ధం అన్న భావనతో ప్రభావితం చేయగలిగే ఓటర్లను గుర్తించి రహస్యంగా డీల్‌ జరుపుతున్నట్లు సమాచారం.

ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలో భాలకు గురిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఎన్నికల కమిషన్‌ నిఘా ఏర్పాటు చేసింది. ఎలాంటి ప్రలోభాలు, డబ్బు పంపిణీ జరగకుండా ఎఫ్‌ఎస్‌టీలు, ఎస్‌ఎఫ్‌ఎస్‌టీలు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ రాజమహేంద్రనాయక్‌ ఆధ్వర్యంలో పో లీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. ముఖ్యమైన వార్డుల్లో అదనపు పికెటింగ్‌, పెట్రోలింగ్‌తో చేస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

రాత్రి నుంచే ప్రలోభపర్వం

‘పోల్‌ మేనేజ్‌మెంట్‌’లో ప్రధాన పార్టీల అభ్యర్థులు

ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు, గిఫ్టులు సిద్ధం

రంగంలోకి ఎన్నికల కమిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement