అక్రమ మైనింగ్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌ పరిశీలన

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

అక్రమ మైనింగ్‌ పరిశీలన

అక్రమ మైనింగ్‌ పరిశీలన

రఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గోపాలస్వామిగుట్ట వద్ద అక్రమంగా మట్టి, మొరం తరలిస్తున్నారని సర్పంచ్‌, గ్రామస్తులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళవారం ప్రభుత్వ విభాగాలు గుట్ట వద్ద పెద్దఎత్తున జరిపిన మట్టి తవ్వకాల వద్దకు వెళ్లారు. మైనింగ్‌ ఏడీ విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ ఎస్సై నరేశ్‌, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ అనిత ఇతర విభాగాల అధికారులు పరిశీలించారు. తవ్వకాలు జరిపిన వద్ద కొలతలు తీసుకున్నారు. అధికారులు వచ్చిన విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికి చేరుకొని జేసీబీ, టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. మట్టిని తరలించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని అశ్రయిస్తామని సర్పంచ్‌ తోటకూరి సదానందం పేర్కొన్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్తులకు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తోటకూరి సదానందం, ఉప సర్పంచ్‌ యాదగిరి, సర్వేయర్‌ నరేశ్‌, ఆర్‌ఐ శరత్‌, జీపీఓ విశ్వేశ్వర్‌రావు, ముప్పిడి రాజు, దుస్స భిక్షపతి, మల్లయ్య, వెంకటరత్నం, రాజు, రవి, సత్యనారాయణరెడ్డి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement