వామ్మో పెద్దపులి!
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లింగాలఘణపురం: మండలంలోని కుందారంలో బుధవారం రాత్రి పులి సంచరించినట్లుగా పాదాల గుర్తుల ఆనవాళ్లు కనిపించాయని ఎఫ్‌ఆర్‌ఓ కొండల్‌రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం కుందారం సమీపంలో పులి పాదాల గుర్తులను గమనించిన రైతులు డయల్ 100కు ఫోన్ చేయడంతో స్థానిక ఎస్సై శ్రావణ్‌కుమార్ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా డీఎఫ్‌ఓ తన సిబ్బందితో వెళ్లి పాదాల గుర్తులను పరిశీలించి పులి సంచరించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మంగళవారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో శారాజీపేటలో ఆవును చంపిన పులి అక్కడి నుంచి కుందారం వచ్చినట్లుగా గుర్తించామని, రఘునాథపల్లి మండలం నారాయణపురం, లింగాలఘణపురం మండలం కుందారం మధ్య సుమారు నాలుగైదు వందల ఎకరాల్లో సర్కార్ తుమ్మ చెట్లు ఉన్నాయని, అక్కడే ఉండి ఉండవచ్చని అనుమానంతో తమ సిబ్బంది గాలిస్తున్నారని వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్‌కు సంబంధించిన నిపుణుల బృందం కుందారం గ్రామానికి చేరుకుని పులి సంచరించిన పరిసరాలను పరిశీలించారు. అందులో పులిని బంధించేందుకు మత్తు ఇంజక్షన్లు వేసే నిపుణులు, డాక్టర్ల బృందం ఉన్నారు.
రఘునాథపల్లి: మండలంలోని శ్రీమన్నారాయణపురం శివారులో పెద్ద పులి సంచారం గుబులు రేపుతోంది. గురువారం తెల్లవారుజామున లింగాలఘణపురం మండలం కుందారం నుంచి మండలంలోని శ్రీమన్నారాయణపురం శివారులోకి వచ్చి నట్లు పాదముద్రలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. స్థానిక ఎస్సై దూదిమెట్ల నరేశ్, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు శ్రీమన్నారాయణపురం, నిడిగొండ, భాంజీపేట రఘునాథపల్లి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
దేవరుప్పుల: మండలంలోని నీర్మాల గ్రామ నర్రెగడ్డ వ్యవసాయ క్షేత్రం ఏరియాలో సరిహద్దు గ్రామమైన వెల్మజాల(గుండాల మండలం)కు చెందిన రైతు జోలం పాండు పులి పాదగుర్తులను గుర్తించి విషయాన్ని అధికారులకు చేరవేశారు. ఈ గుర్తుల ఆధారంగా నీర్మాల నుంచి వనపర్తి మీదుగా కుందారం మీదుగా రఘనాథపల్లి మండలానికి వెళ్లిందనే పులి అడుగుల గుర్తులను బట్టి తెలుస్తోంది. కడవెండి–సీతారాంపురం మధ్య కూటికంటి ఎల్లయ్య అనే రైతు వ్యవసాయ పొలాల వద్ద గుర్తులను చూడగా.. జనగామ ఫారెస్టు డీఆర్‌ఓ ఆజాజ్ అహ్మద్, బీట్ ఆఫీసర్ రమేశ్, ఎస్‌ఓ రవీందర్, స్థానిక ఎస్సై ఊర సృజన్‌కుమార్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని గుర్తించి ఆ ప్రాంత రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎఫ్‌ఆర్‌ఓ కొండల్ రెడ్డి
జనగామ రూరల్: జిల్లాలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామశివారుల్లో పులి సంచరిస్తున్నట్లు దాని పాదముద్రల ద్వారా గుర్తించినట్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌ఆర్‌ఓ రావుల కొండల్ రెడ్డి తెలిపారు. లింగాల ఘణపురం, రఘునాథపల్లి, నర్మెట, జనగామ, దేవరుప్పుల మొదలగు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దన్నారు. అత్యవసరమైతే గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. పశువులను ఇంటివద్దనే సంరక్షించుకోవాలన్నారు. పులి సంచార సమాచారం తెలిస్తే ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
పలు మండలాల్లో పాదముద్రలు,
సంచరించినట్లు గుర్తింపు
భయాందోళనలో ప్రజలు, రైతులు
అప్రమత్తంగా ఉండాలంటున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు
వామ్మో పెద్దపులి!
వామ్మో పెద్దపులి!
వామ్మో పెద్దపులి!


