అమలు కాని హామీలతో మోసం
● ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తూ అమలు కాని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా 13, 17, 18, 19, 22, 23, 24 తదితర వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి తప్ప, ప్రస్తుత కాంగ్రెస్ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్లుగా తమ నీలిమా ఆస్పత్రిలో కార్పోరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పట్టణ ఓటర్లు బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, గద్దల నర్సింగారావు తదితరులు ఉన్నారు.


