ప్రతిభను వెలికిదీసేందుకే సీఎం కప్ పోటీలు
● అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్
పాలకుర్తి టౌన్: గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికిదీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ అన్నారు. గురువారం మండలంలోని కార్మెల్ స్కూల్‌లో సీఎం కప్ క్రీడలను అదనపు కలెక్టర్ ముఖ్య అఽతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గస్థాయిలో నిర్వహించే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి కోదండరామ్, ఎంపీడీఓ వేదవతి, తహసీల్దార్ సరస్వతీ, సీఐ జానకీరాంరెడ్డి, సర్పంచ్ కమ్మగాని విజయ, ఎస్సై పవన్‌కుమార్, ఎంఈఓ పోతుంటి నర్సయ్య, హైస్కూల్ హెచ్‌ఎం శోభారాణి, ప్రగతి విద్యాలయం ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
నేలను కాపాడుకోవాలి..
జఫర్‌గఢ్: నేల సంపదను కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్ర భుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్కూల్ సాయిల్ హెల్త్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ వరలక్ష్మి, డీఏఓ అంబికాసోని, ఏడీఏ వసంత సుగుణ, తహసీల్దార్ రాజేశ్‌రెడ్డి, ఎంపీడీఓ సుమన్, శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు.


