ఎన్నికల నియమావళి పాటించాలి
జనగామ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలని ఏఎస్పీ పండారీ చేతన్ నితిన్ సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోటీచేస్తున్న అభ్యర్థులకు బుధవారం సిద్దిపేట రోడ్డులోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో ఎన్నికల ఖర్చులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల నియమావళి అనుసరించి వ్యయాలు ఉండాలని, నిబంధనలు ఉల్లంగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు, మున్సిపల్ కమిషనర్, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


