ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలి
● జనరల్ అబ్జర్వర్ ఎ. నర్సింహారెడ్డి
జనగామ రూరల్: ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహారెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా జనరల్ అబ్జర్వర్ ఎ.నర్సింహరెడ్డి ఘనపూర్, జనగామ మున్సిపాలిటీ పరిధిలోని నామినేషన్ ఉపసంహరణ కేంద్రం డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయనతో పాటు నోడల్ ఆఫీసర్ మాతృనాయక్ సిబ్బంది ఉన్నారు.


