పూర్వ విద్యార్థుల ఔదార్యం
● పాఠశాలకు రూ,1,20,000 విలువైన డెస్క్ బెంచీల అందజేత
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలో 1996–1997 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అర్జుల రాంరెడ్డి, గందె రాధిక సహకారంతో పాఠశాలకు రూ.1,20,000 విరాళాన్ని ప్రకటించారు. ఆ విరాళంతో 25 డెస్క్ బెంచీలను ఆదివారం పాఠశాలకు అందజేశారు. 2024 డిసెంబర్ 1న నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో.. ఆ నిధులతో విద్యార్థులకు ఉపయోగార్థం 25 డెస్క్ బెంచీలను గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప, ఉపాధ్యాయల సమక్షంలో పాఠశాలకు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాచర్ల పుల్లయ్య, మడత రవీంద్రుడు, బెల్లి సంపత్, సర్థార్ అశోక్, మానుపాటి శ్రీనివాస్, గదరి నర్సింగ్,కూస సోమయ్య, తుమ్మ నాగలక్ష్మీ, సుజాత, పెద్దురి కళావతి, వంగపల్లి స్వరూప, ఎనగందుల సునీత, టీ రమేష్, కుమార్, పూజారి మల్లయ్య పాల్గొన్నారు.


