పురపాలికలకు నిధుల వరద
మంత్రులు ఏమన్నారంటే..
8లో
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కొద్ది రోజులుగా పలు కొత్త జిల్లాలను రద్దు చేస్తారని, రెండు జిల్లాలను కలిపి ఒకటి చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లిని కలిపి ఒకటే చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలను రద్దు చేయబోమని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని ప్రకటించారు. దీంతో భూపాలపల్లి జిల్లా రద్దు అనే ప్రచారానికి చెక్ పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
భూపాలపల్లి జిల్లా చెల్పూరులో జరిగిన సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న సీఎం రేవంత్
పాలకవర్గాలు లేకపోయినా గడిచిన ఏడాదిలో భారీగా విడుదల చేశాం..
భూపాలపల్లి / భూపాలపల్లి అర్బన్ / రేగొండ / గణపురం: ఏడాది కాలంగా మున్సిపాలిటీలకు పాలకవర్గాలు లేకపోయినా భారీగా నిధులు మంజూరు చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నా రు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారు సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా పాలన–ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... గడిచిన ఏడాది కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ. 92 కోట్లు, పరకాలకు రూ.52 కోట్లు, జనగామకు రూ.82కోట్లు.. ఇలా ప్రతీ మున్సిపాలిటీ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలో ఏర్పడబోయే పాలకవర్గం ఆ నిధులతో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలన్నారు.
ఓరుగల్లుది ఉద్యమాల చరిత్ర..
ఉమ్మడి వరంగల్‌కు గొప్ప చరిత్ర ఉందని, ప్రపంచంలోనే భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కర్త, క్రియగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యవహరించారన్నారు. రాష్ట్రాన్ని సాధించడంలో ముందుభాగంలో నిలబడిన ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతం బిడ్డ అంటూ.. ఓరుగల్లు ఉద్యమ చరిత్రను గుర్తు చేశారు. సింగరేణి కార్మికులు సైతం రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు.
మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం..
తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు సింగరేణి మెడికల్ బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బోర్డును రద్దు చేసేది లేదని, విష ప్రచారం చేస్తున్న వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టాలని సీఎం అన్నారు. 217 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, వారి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయబోమన్నారు.
బైపాస్‌కు నిధులు మంజూరు..
భూపాలపల్లి పట్టణంలో నిత్యం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని, కేంద్రంతో మాట్లాడి బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం డీపీఆర్ ప్రక్రియ పూర్తయిందని, టెండర్ దశలో ఉందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏనాడూ భూపాలపల్లి పట్టణాన్ని పట్టించుకోలేదన్నారు.
ఆయన నకిలీ గండ్ర..
మీ ఎమ్మెల్యే సత్యనారాయణరావు అసలు గండ్ర అని, మరొకరు నకిలీ గండ్ర అని సీఎం రేవంత్ అన్నారు. నకిలీ గండ్రను మీరు నమ్మి గెలిపిస్తే గుండెల మీద తన్ని వేరే పార్టీలో చేరాడన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.205 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల నమూనా చెక్కును సీఎం అందజేశారు.
ఆకట్టుకున్న ఇందిరా ‘మహిళా’శక్తి చీరల రంగు
మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకంకింద అందించిన నీలి రంగు చీరలను కట్టుకుని ప్రాంగణానికి చేరుకున్నారు. అందరూ ఒకేచోట కూర్చోవడంతో ప్రాంగణ మంతా నీలిరంగుతో కళకళలాడింది. సీఎం, మంత్రుల ప్రసంగాల సమయంలో మహిళలు కేరింతలు కొట్టారు. మరికొందరు నృత్యాలు చేశారు.
మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం
భూపాలపల్లి బైపాస్ రోడ్డు
నిర్మాణానికి రూ.500 కోట్లు
సింగరేణి మెడికల్ బోర్డు
రద్దు చేస్తామంటూ విష ప్రచారం
మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్
అభ్యర్థులను గెలిపించండి
చెల్పూరు ప్రజా పాలన–ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
పురపాలికలకు నిధుల వరద
పురపాలికలకు నిధుల వరద
పురపాలికలకు నిధుల వరద


