సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

సేంద్

సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు

దేవరుప్పుల: విషతుల్య ఆహారపు ఉత్పత్తులకు స్వస్తి పలికేలా సేంద్రియ పంటల సాగుతో రైతులు బహుళ ప్రయోజనాలు పొందుతారని జిల్లా సాంకేంతిక వ్యవసాయ అధికారులు శరత్‌చంద్ర, విజయ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధారావత్‌తండాలో కునుసోతు బిచ్చనాయక్‌ వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న సేంద్రియ ఎరువు తయారీ, పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సేంద్రియ సాగులో వర్మికంపోస్టు, జీవామృతం, బీజామృతం, ఘనజీవామృతం వంటి స్వతహాగా తయారు చేసుకొని విజయవంతంగా సాగు చేస్తున్న రైతు బిచ్చానాయక్‌ను అభినందించారు. కార్యక్రమంలో పెద్దమడూరు ఏఈఓ భాస్కర్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు

68 మంది గైర్హాజరు

జనగామ రూరల్‌: ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు 68మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్‌ విద్యాధికారి జితేందర్‌ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాల్లో జనరల్‌, ఒకేషనల్‌ ప్రయోగ పరీక్షలు జరగగా మొత్తం 429 మంది జనరల్‌ విద్యార్థులకు గాను 425మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో మొత్తం 307 విద్యార్థులకు గాను 274మంది హాజరు కాగా, 33మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 410 జనరల్‌ విద్యార్థులకు గాను 403మంది హాజరు కాగా, 7 గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 222 విద్యార్థులకు గాను 198 హాజరు కాగా 24 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌ విద్యాధికారి జితేందర్‌ రెడ్డి జనగామ, జఫర్‌గఢ్‌, స్టేషన్‌ ఘన్‌ఫూర్‌ పరీక్షా కేంద్రాలను సందర్శించగా డీఈసీ సభ్యులు శ్రీనివాస్‌ పాలకుర్తి, కొడకండ్లలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

పీహెచ్‌సీలో

ప్రసవాలు పెంచాలి

రఘునాథపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌రావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల వల్ల కలిగే లాభాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పీహెచ్‌సీలో జరుగుతున్న కార్యక్రమాలపై రివ్యూ చేసి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ కమలహాసన్‌, ఎంఎల్‌హెచ్‌పి డాక్టర్‌ ప్రీతి, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ రామ్‌కిషన్‌, హెచ్‌ఈఓ ప్రభాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రూ.5వేల కోట్లు కేటాయించాలి

జనగామ రూరల్‌: రాష్ట్ర బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కుర్ర ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర బడ్జెట్లో ప్రతిసారి అన్యాయమే జరుగుతోందని, గత సంవత్సరం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి అందులో కేవలం రూ.17 కోట్లే ఖర్చు చేశారన్నారు. ఏప్రిల్‌ 17న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద జరిగే నిరాహార దీక్షకు గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య, కనకట రాజయ్య, పరదుల భాస్కర్‌, బండపల్లి శంకరయ్య, మాచర్ల రఘురాములు, జొన్నగోని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు1
1/2

సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు

సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు2
2/2

సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement