వివక్షలేని సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వివక్షలేని సమాజమే లక్ష్యం

Feb 5 2026 7:26 AM | Updated on Feb 5 2026 7:26 AM

వివక్షలేని సమాజమే లక్ష్యం

వివక్షలేని సమాజమే లక్ష్యం

జనగామ రూరల్‌: అసమానతలు, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎన్‌.ఎల్‌.నరసింహారావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలకు సమానత్వం, సాధికారత పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో పనిచేసే హౌస్‌ కీపింగ్‌ సిబ్బందిని సన్మానించారు, అంతకుముందు తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు పింకేశ్‌ కుమార్‌, బెన్‌షాలోమ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాల వివరాలివ్వండి

డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాల అప్పగింతకు సంబంధించిన వివరాలు అందించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. గూగుల్‌ మీట్‌లో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, సోషల్‌ వెల్ఫేర్‌ తదితర ఇంజనీరింగ్‌ అధికారులు గతంలో చేపట్టిన రెండు పడక గదుల నిర్మాణలకు సంబందించిన పూర్తి వివరాలతో టెక్నికల్‌, ఫిజికల్‌లతో సహా ఫిబ్రవరి 15వ తేదీలోగా హౌజింగ్‌ శాఖకి అప్పగించాలని అధికారులకు సూచించారు.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement