భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి

Feb 6 2026 7:49 AM | Updated on Feb 6 2026 7:49 AM

భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి

భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి

జనగామ రూరల్‌: భూసేకరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో భూసేకరణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో వివిధ దశల పురోగతిని కలెక్టర్‌ సమీక్షించారు. యూనిట్‌–1 పరిధిలో, పీఎన్‌ దశలో, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన అవార్డు విచారణను రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి గ్రామాల వారీగా సంయుక్త తనిఖీల ద్వారా వారం లోపు పూర్తి చేయాలని, పెగ్‌ మార్కింగ్‌ పనులను నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే యూనిట్‌–2 పరిధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ పనులను వారం లోపు, పెగ్‌ మార్కింగ్‌ను నెలలోపు పూర్తి చేయాలని రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌, జనగామ పరిధిలో భూసేకరణ పెండింగ్‌లో పనులను వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. చీటకోడూర్‌ ఆర్‌ఎంసీకి సంబంధించి అవార్డు విచారణను ‘సర్వే – పేమెంట్‌ వెరిఫికేషన్‌ టీం’ ద్వారా ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖల అధికారులు, సర్వేయర్లతో కలిసి తనిఖీ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని సూచించారు. అదేవిధంగా అశ్వరావుపల్లికి సంబంధించిన భూసేకరణ కూడా వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు జనగామ, ఘనపూర్‌ స్టేషన్‌ ప్రత్యేక ఉప కలెక్టర్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

మ్యాపింగ్‌ ప్రక్రియ..

ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ, ఎస్సీ స్కాలర్‌షిప్‌, మున్సిపల్‌ ఎలక్షన్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ గూగుల్‌ మీటింగ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, బీఎల్వోలు ఆయా పోలింగ్‌ కేంద్రాల వారీగా క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ వేగవంతంగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. మున్సిపల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, అధికారులు వసంత, విక్రమ్‌, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement