బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
పాలకుర్తి టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని దేవస్థానం ఆవరణంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. ప్రచార రథాల ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి జాతర ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్‌శర్మ, అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.
సోమన్న ఆలయంలో ప్రచార రథాలు ప్రారంభం


