బుగులు వెంకన్నకు నాగాభరణాలు | - | Sakshi
Sakshi News home page

బుగులు వెంకన్నకు నాగాభరణాలు

Feb 5 2026 7:28 AM | Updated on Feb 5 2026 7:28 AM

బుగుల

బుగులు వెంకన్నకు నాగాభరణాలు

చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామికి బుధవారం సంగోజు మోహనాచారి–శంకర్‌లక్ష్మి దంపతులు రూ.50వేల విలువైన రెండు వెండి నాగాభరణాలు, ఇత్తడి ప్లేటును ఆలయ అర్చకులకు అందజేశారు. ఆలయానికి చేరుకున్న దాత దంపతులు అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్‌ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో ఆలయానికి అందజేశారు. కార్యక్రమంలో కుర్రెంల మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాటికొండ జాతర ఆదాయం రూ.2లక్షలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని తాటికొండ, జిట్టెగూడెం సమ్మక్క–సారలమ్మ జాతర ఆదా యం రూ.2,03,738లు వచ్చినట్లు జాతర కమిటీ బాధ్యులు తెలిపారు. జాతర కమిటీ గౌరవ అధ్యక్షుడు చల్లా సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు రాపోలు మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు మారపాక సుజనశ్రీను, బానోతు బాలునా యక్‌ ఆధ్వర్యంలో బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. జాతర ఆదాయం రూ.2,03,738 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు లునావత్‌ రజిత రవీందర్‌, ఎడమ కట్టమల్లు, వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

ఎల్‌సీ యాప్‌ ద్వారా

లైన్‌క్లియర్‌ తప్పనిసరి

జనగామ రూరల్‌: ఎల్‌సీ యాప్‌ ద్వారా లైన్‌క్లియర్‌ తప్పనిసరిగా తీసుకోవాలని విద్యుత్‌ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఆపరేషన్స్‌ సంపత్‌రెడ్డి అన్నారు. బుధవారం జనగామ టౌన్‌–1లో సెక్షన్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యుత్‌ పనుల నిర్వహణలో భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డివిజనల్‌ ఇంజనీర్‌ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ డి.వేణుగోపాల్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (టౌన్‌–1) బి. సౌమ్య, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (బచ్చన్నపేట) జి. రాజ్‌కుమార్‌, సబ్‌ ఇంజనీర్‌ ఎం.మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

బుగులు వెంకన్నకు నాగాభరణాలు1
1/2

బుగులు వెంకన్నకు నాగాభరణాలు

బుగులు వెంకన్నకు నాగాభరణాలు2
2/2

బుగులు వెంకన్నకు నాగాభరణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement