నిర్భయంగా ఓటేయాలి
● పోలీస్ కవాతులో ఏసీపీ భీమ్‌శర్మ
స్టేషన్‌ఘన్‌పూర్: ఈనెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం డివిజన్‌కేంద్రంలో పోలీసుకవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పోలీసుశాఖ తరఫున తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని, డీసీపీ పర్యవేక్షణలో ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసు కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారన్నారు. కార్యక్రమంలో సీఐలు జి.వేణు, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు వినయ్‌కుమార్, రమేశ్, మనీషా తదితరులు పాల్గొన్నారు.


