పట్టణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
● నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు
జనగామ: పట్టణ అభివృద్ధి ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమని నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు అన్నారు. పురపాలిక ఎన్నికల్లో భాగంగా 7,8,9,10 వార్డుల్లో బుధవారం ఇంటింటి ప్ర చారం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి, పట్టణ సమగ్రాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందించాలన్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి ఇలా అరు గ్యారంటీ పథకాలతో ప్రతీ ఇంటికి లబ్ధి చేకూరుతుందన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామని, అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలన్నారు. యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ తదితరులు ఉన్నారు.


