ఆదర్శ మున్సిపాలిటీగా ‘ఘన్‌పూర్’
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా బీఫామ్‌లు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.. ప్రజల అభిప్రాయాలు, గెలిచే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే..
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 1వ వార్డు సింగపురం దయాకర్, 2వ గుర్రం హరినాధ్, 3వ గుర్రం హైమ, 4వ బూర్ల శంకర్, 5వ వార్డు కొంతం రజిత, 6వ కనకం రమేశ్, 7వ అన్నెపు సుమలత, 8వ చాతరబోయిన సత్యనారాయణ, 9వ సౌదరపల్లి సంపత్‌రాజ్, 10వ తోకల అనూష, 11వ నీల రాజమ్మ, 12వ గట్టు సంగీత, 13వ తాటికొండ వినయ్‌కుమార్, 14వ పెసరు కృష్ణవేణి, 15వ బొల్లు లక్ష్మీ, 16వ అంగడి రజిత, 17వ పొన్నం స్వరూప, 18వ వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిగా పొన్నం రవిని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన
వరంగల్ ఎంపీ కడియం కావ్య


