రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో నష్కల్ విద్యార్థికి గోల్డ
చిల్పూరు: మండలంలోని నష్కల్ గ్రామానికి చెందిన పాశం వేణు కుమారుడు విశ్వేష్ ఆదివారం సెయింట్ ఆంథోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రాండ్‌మాస్టార్లు పాపయ్య, ప్రశాంత్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్‌తో పాటు సర్టిఫికెట్ అందుకున్నాడు. అంతర్‌రాష్ట్ర ఓపెన్ స్కూల్స్ టోర్నమెంట్ సికోకై షీటో రియో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే పోటీలు నిర్వహించగా విశ్వేష్ స్పారింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈసందర్భంగా సర్పంచ్ శాతబోయిన రాజు, పాశం రాజు, శాగంటి మణి, గుంజె రఘుపతి, రంగు రాజు, స్కూలు యాజమాన్యం అభినందనలు తెలిపారు.
జనగామ రూరల్: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 57మంది గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాల్లో నిర్వహించగా ఉదయం జరిగిన పరీక్షలో జనరల్‌లో 287 మంది విద్యార్థులకు గాను 286మంది హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 270మంది విద్యార్థులకు గాను 236మంది హాజరు కాగా 34 గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 217మంది విద్యార్థులకు గాను 216మంది హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ 291మంది విద్యార్థులకు గాను 270మంది హాజరు కాగా, 21మంది గైర్హాజరయ్యారు.


