జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో రాత్రి 9 గంటలకు వందలాది మంది ప్రయాణికుల రద్దీ
పెళ్లిళ్లు, శుభకార్యాలు, దుర్గామాత, బొడ్రాయి పండుగలతో జనగామ ఆర్టీసీ బస్టాండ్ జాతరను తలపించింది. శుక్రవారం రాత్రి 10 గంటలు దాటినా వందలాది మంది ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించారు. హన్మకొండ, జగద్గిరిగుట్ట, సిద్దిపేట, తరిగొప్పుల తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌లతో పాటు ప్రయాణ ప్రాంగణం మొత్తం నిండిపోయారు. బస్సులు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేదాక చూడకుండా ఎదురుగా వెళ్లి ఎక్కే ప్రయత్నం చేశారు. ఒక్కో బస్సులో 90 నుంచి 100 మందికి పైగా ప్రయాణం చేశారు.
– జనగామ


