సౌర విద్యుత్‌ ప్రయోజనాలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ ప్రయోజనాలు వినియోగించుకోవాలి

May 8 2026 12:19 PM | Updated on May 8 2026 12:19 PM

సౌర విద్యుత్‌ ప్రయోజనాలు వినియోగించుకోవాలి

లింగాలఘణపురం: సౌర విద్యుత్‌తో ఉండే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్‌కో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని రైతు వేదికలో వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్‌ కేంద్రాలపై ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, సబ్సిడీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ జలవిద్యుత్‌, థర్మల్‌ విద్యుత్‌కు ఉపయోగపడే వనరులు తగ్గడం, కాలుష్యం వంటి సమస్యలు ఏర్పడుతాయని, సౌర విద్యుత్‌తో ఎలాంటి కాలుష్యం లేకుండా సూర్యరశ్మితో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందన్నారు. వ్యవసాయ క్షేత్రాలతో పాటు, గృహ అవసరాలకు సౌర విద్యుత్‌ను వినియోగించుకొని ఎక్కువ ఉత్పత్తి అయితే గ్రిడ్‌ కొనుగోలు చేస్తే ఉత్పత్తిదారులకు ఆదాయం కూడా వస్తుందన్నారు. సమావేశంలో ఏడీ అనిల్‌కుమార్‌, ఏఈ శంకరయ్య, లింగాలఘణపురం సర్పంచ్‌ ఎడ్ల లావణ్య, ట్రాన్స్‌కో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement