కొడకండ్ల: మండలంలో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నా గుమ్ములబండ తండాలో మాత్రం నెలరోజులుగా ఉపాధి పనులకు కూలీలు రావడం లేదు. ఉపాధిహామీ సిబ్బంది తండాకు వెళ్లి పలుమార్లు ఉపాధి పనులకు రావాలని కూలీలను కోరినా ఫలితం లేకుండా పోయింది. గుమ్ములబండ తండాలో 112 జాబ్‌కార్డులుండగా 200 దాకా కూలీలు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా 120 మంది ఉపాధి కూలీలు పనులు హాజరవుతుంటారు. ఈ సీజన్‌లో వరి కోతలు, మొక్కజొన్న కోతలు వంటి వ్యవసాయ పనులుండటంతో వారంతా ఆ పనుల్లో నిమగ్నమై ఉపాధి పనులకు దూరంగా ఉంటున్నారు. కాగా, శనివారం సర్పంచ్ గుగులోత్ వీరేశ్‌నాయక్ ఇంటింటికి తిరిగి ఉపాధి పనులకు హాజరు కావాలని బొట్టు పెట్టి మరి కూలీలను ఆహ్వానించారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు ఉండటం వలన రాలేకపోయామని, సోమవారం నుంచి హారజవుతామని కూలీలు ఏపీఓ నరిగే కుమారస్వామికి తెలిపారు.
బొట్టుపెట్టి రావాలని సర్పంచ్ వినతి


